22 March, 2026 | 2:59 AM

యాదగిరిగుట్టపై ప్రమాదం

22-03-2026 01:26 AM

ఆర్టీసీ బస్సు టైర్ కింద పడ్డ భక్తురాలు.. కాలికి తీవ్ర గాయం

యాదగిరిగుట్ట, మార్చి 21 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో కొండ పైన కదులుతున్న ఆర్టీసీ బస్సు వెనక టైరు కింద భక్తురాలు పడింది. నార్సింగికి చెందిన అనిత (25) కుటుంబ సభ్యులతో శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్ట దేవాలయానికి వచ్చింది. శనివారం ఉదయం దర్శనం అనంతరం కొండపైన బస్టాండులో బస్సు ఎక్కడానికి వెళ్తుండగా బస్సు ముందుకు కదిలింది. దీంతో వెనుక టైర్ కింద పడటంతో కాలుకు తీవ్ర గాయం అయ్యింది. అంబు లెన్స్‌లో భువనగిరి జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.