మతసామరస్యానికి ప్రతీక రంజాన్
ముషీరాబాద్/మలక్‌పేట్, మార్చి 21 (విజయక్రాంతి): రంజాన్ పండుగ రాష్ట్ర వ్యా ప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, ప్రార్ధనా మందిరాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిచారు. అనంతరం ప్రార్థనా మందిరాల వద్ద రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మతసామరస్యానికి ప్రతీక పండుగ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు మసీదుల వద్ద ముస్లింలను కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ, ఎంఎన్. శ్రీనివాస్ రావు, ఎడ్ల హరిబాబు యాదవ్, వై. శ్రీనివాసరావు, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్ పూర్‌లో గల 400 సంవత్సరాల చరిత్ర గల బడి మసీదులో ఉదయం 8 గంటల నుంచి ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించా రు. బడి మసీదు మత పెద్ద ముత్తావలి నజీ ర్ అలీ నేతృత్వంలో వందలాదిమంది ము స్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి ప్రార్థనలో పాల్గొన్నారు.
అనంతరం ప్రార్థనలు పూర్తయిన తర్వాత బడి మసీదు ప్రాంగణంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలు పుకున్నారు. అంబర్‌పేట్‌లో నెహ్రూ నగర్ గ్రౌండ్, ఎంసిహెచ్ గ్రౌండ్స్‌లో ము స్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై సామూహిక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమానికి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరై ముస్లిం సోదరులను కలిసి ఆలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఆనందోత్సాహాలతో..
పవిత్రమైన రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నెలవంక దర్శనంతో శనివారం ఈద్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. రంజాన్ నెలలో ఉపవాసాలు, న మాజ్‌లు, దానధర్మాలు నిర్వహించిన ము స్లింలు, ఈద్ రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసి పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అం టూ శుభాకాంక్షలు తెలియజేసుకు న్నా రు. ఈ పండుగ సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో చార్మి నార్ పరిసరాలు, పాతబస్తీ ప్రాంతాలు ఈద్ సందడితో కళకళలాడుతున్నాయి.
మాజీ హోం మంత్రి నివాసానికి కేటీఆర్
మాజీ హోం మంత్రి మహమూద్ అలీ నివాసానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయ కులు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో చేరు కుని కేటిఆర్‌ను కలిశారు. ముస్లిం సోద రుల ను కలిసి రంజాన్ శుభాకాంక్ష లు తెలుపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు ఆజం అలీ, లాయక్ అలీ తదితరులు పాల్గొన్నారు.




