17 April, 2026 | 2:01 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణలో జవాబుదారీతనం

06-04-2025 12:25 AM

బీజేపీ అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు  2025 ఆమోదంతో వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో జవాబు దారీతనం, నైతికత పెరుగుతుందని బీజేపీ అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకులు చేసిన చారిత్రక తప్పిదాలను దశాబ్దకాలం నరేంద్ర మోదీ పాలనలోని బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతుందన్నారు.

పాత చట్టాలలోని లోపా లను సవరిస్తూ నేడు భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఉన్నత స్థితిలో నెలబెడుతున్నారని కొనియాడారు. న్యాయసూత్రాల కంటే మత విశ్వాసాలే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ తమ కు ప్రజలు కట్టబెట్టిన మెజార్టీని ఏ విధంగా ఉపయోగించుకుందో షాబానో కేసు ప్రత్యక్ష ఉదాహరణ పేర్కొన్నారు.

ఇదే తరహా విధానాన్ని వక్ఫ్ చట్టం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయ సూత్రాలకు అతీతంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమని వ్యవహరించినట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 8,68,054 వక్ఫ్ ఆస్తులలో 4,36,169 ఆస్తులకు సరైన రికార్డులు లేవన్నారు. వీటితో పాటు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా గ్రామాలకు గ్రామాలు వక్ఫ్ ఆస్తులంటూ ప్రకటించడం దారుణమని వాపోయారు.