17 April, 2026 | 3:22 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జనం గుండెచప్పుడు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు

06-04-2025 12:28 AM

కడ్తాల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : కడ్తాల్ మండలంలో జనం గుండెచప్పుడుగా రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని అ ట్రస్ట్ చైర్మన్ దశరథ్ నాయక్ అన్నారు. ఈ నెల 3న కడ్తాల్ మండలంలోని ముద్విన్, చరికొండ గ్రామ పంచా యతీలలో పర్యటించి బోయిన్ గుట్ట తండా లో నిర్వహించిన సభను విజయవంతం చేసిన ప్రజలకు, ముఖ్య అతిథులుగా హాజరైన  మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిని శనివారం కడ్తా ల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. వారి నివాసాల్లో కలిసి శాలువాలతో  సన్మానించారు.

కడ్తాల్‌లో హరీశ్‌రావు పర్యటనతో  బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందని త్వరలోనే జరిగే స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ సత్తా ఏమిటో చాటుతామని తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ ఎస్టీ కమిషనర్ రాం పాల్ నాయక్ మాజీ సర్పంచ్ లాల్ కోట  నర్సింహా గౌడ్ నాయకులు అంజి నాయక్, ఈశ్వర్ నాయక్, శ్రీను నాయక్, ప్రశాంత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.