12 May, 2026 | 3:40 AM

హత్య కేసులో నిందితుల అరెస్ట్

12-05-2026 01:33 AM
  1. డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ 
  2. డీసీపీ రక్షిత కృష్ణమూర్తి

సికిందరాబాద్, మే11 (విజయక్రాంతి): ఈ నెల 7న చిలకలగూడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన యావన్ హత్య కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సోమవారం సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఈ కేసులో సాయి కిరణ్ మొదటి నిందితుడు. అతడే యావన్ హత్యకు ప్లాన్ చేశాడు.. అరెస్ట్ అయిన వారిలో యువతి తండ్రి నరసింహ యాదవ్, బాబాయిలు మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ఉన్నారు.

అమ్మాయి బ్రదర్ పరమేష్ , అలానే ఓ మైనర్ కూడా ఉన్నాడు’  అని డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు. పక్కా ప్లాన్ చేసి.. యావన్‌ను హత్య చేశారని ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచే యావన్ మేడి బావి ప్రాంతానికి వస్తే చంపేందుకు ప్లాన్ చేశారన్నారు. 7న యావన్ తన స్నేహితుడైన సుబ్బు ఇంటికి వద్దకు రాగా, నిందితులు వచ్చి యావన్‌తో గొడవపడి కత్తితో పొడిచి చంపేశారని చెప్పారు. నిందితుల్లో రాహుల్, శివలకు గంజాయి పాజిటివ్ వచ్చిందని తెలిపారు.