21 May, 2026 | 3:17 AM

దేవాలయ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్.. పరారీలో ఇద్దరు

21-05-2026 01:41 AM

తంగళ్ళపల్లి మే 21 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పంచలోహ గరుడ వాహనాన్ని దొంగిలించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు.జనవరి 21, 2026న ఒంగోలు జిల్లాకు చెందిన చైతన్య మణికంఠ తంగళ్లపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోకి చొరబడి పంచలోహ గరుడ వాహనాన్ని అపహరించినట్లు ఆయన వెల్లడించారు.

వాహనాల తనిఖీల సందర్భంగా నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. అనంతరం అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ పేర్కొన్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన ఎస్‌ఐ ఉపేంద్ర చారి, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుళ్లు సంపత్, శ్రావణ్లను సీఐ అభినందించారు.