ఇరువర్గాల మధ్య సయోధ్య
మేడ్చల్, మే 20 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా అడ్రస్ పల్లి గ్రామంలో ఇటీవల జరిగిన శ్రీరామనవమి సందర్భంగా కొందరు దళితులకు అవమానం జరిగిందనే ఫిర్యాదు మేరకు బుధవారం గ్రామంలో ని రామాలయంలో విచారణ జరిపారు.
ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్, మున్సిపల్ చైర్మన్ జాము రవి, బిట్ల వెంకటేశ్వర్లు, ధనరాజ్ నాయక్, పాకాల అశోక్, రామ్మోహన్, ప్రభాకర్, అజయ్, నాగేశ్వర చారి, ఎస్సీ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, ఏసిపి, సిఐ తదితరులు విచారణలో పాల్గొన్నారు. ఇరువర్గాల కుల పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. ఇకముందు జరిగే అన్ని పండుగలు సంప్రదాయ పద్ధతిలో ఒకరినొకరు గౌరవించుకొని ఆలయ ప్రవేశంలో గాని, ఉత్సవాలలో వివక్ష చూపరాదని తీర్మానించారు. ముగ్గురిపై నమోదైన అట్రాసిటీ కేసును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.






