బీసీల మేధోమధన సమావేశం
- 17న విజయవాడలో నిర్వహణ
- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా ఉన్న బీసీ డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించి, బీసీల రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో బీసీల మేధోమధన సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణలో బీసీ కులగన, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కో ట, సామాజిక రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తివేత అతి త్వరలోనే ఢిల్లీ కేంద్రంగా జరిగే బిసి గర్జన సమావేశంపై చర్చించడానికి బీసీ మేధావులు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, న్యాయమూర్తులు సామాజిక తత్వవేత్తలు బీసీ ఉద్య మకారులతో బీసీ మేధో మదన సమావేశం లో పాల్గొని భవిష్యత్ బీసీ తరాల కోసం విజయవాడ డిక్లరేషన్ ప్రకటిస్తామని ఆయ న తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేశన శంకర్‌రావు ఆధ్వ ర్యంలో సమావేశం జరుగుతుందన్నారు.






