వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్టు
ఖమ్మం టౌన్, మే 26 (విజయ క్రాంతి): వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. మంగళవారం టేకులపల్లి వంతెన వద్ద ఎస్త్స్ర వి. రమేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీల్లో చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించగా గత కొంతకాలం నుండి ఖమ్మంలో రెండు మోటార్ సైకిల్, రెండు ఆటోలు దొంగిలించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారుగా 3,30,000 ఉంటుందని తెలిపారు.
ఖమ్మం బైపాస్ రోడ్ లో సిపిఐ ఆఫీస్ వద్ద ఒక మోటార్ సైకిల్ ను రెండవది ఖమ్మం బాలాజీ నగర్ లో లిటిల్ స్టార్ హాస్పిటల్ వద్ద ఒక ఆటోను, మూడోది ఖమ్మం బ్రాహ్మణ బజార్లో ఒక ఇంటి ముందు ఉన్న పల్సర్ మోటార్ సైకిల్ ను, మరియు ఖమ్మం నెహ్రూ నగర్ లో ఒక హాస్పిటల్ ముందు ఆగి ఉన్న ఒక ఆటోను దొంగిలించి నేరాన్ని అంగీకరించారని పేర్కొన్నారు. నిందితులు ఖమ్మం పెద్ద తండాకు చెందిన ఆటో డ్రైవర్లైన నునావత్ సాయికుమార్, బానోత్ సాయికుమార్, వియం బంజరకు చెందిన రేపల్లి శ్రీను అలియాస్ రాజు అని ఇతని పై గతంలో కూడా ఖమ్మం ఒకటవ టౌన్ పరిధిలో రెండు దొంగతనాలు చేశాడని తెలిసిందన్నారు. రెండు ఆటోలు, రెండు మోటార్ సైకిల్ ను స్వాధీనపరచుకొని వారిని అరెస్టు చేసి కోర్టు నందు హాజరు పరిచినట్లు తెలిపారు.






