27 May, 2026 | 2:04 AM

సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో మిస్టు విద్యార్థుల ప్రతిభ

27-05-2026 12:08 AM

సత్తుపల్లి మే26( విజయ క్రాంతి): గత ఏప్రిల్ నెలలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్  నిర్వహించిన డిప్లమా మొదటి సంవత్సరం,2వ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో మదర్ తెరిసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలను సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలసాని హరికృష్ణ  తెలియజేశారు.

అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల వివరములు బ్రాంచీల వారీగా మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ సిఎస్సి బ్రాంచ్ నుండి జొన్నాదుల గీతామాధురి 10.00 ఎస్ జి పి ఏ, తుమ్మ. పల్లవి 9.50 ఎస్ జి పి ఏ, సురోజు. లక్ష్మీ పూజిత 9.25 ఎస్ జి పి ఏ లు, ద్వితీయ సంవత్సరం రెండవ సెమిస్టర్ సిఎస్సి బ్రాంచ్ నుండి తిప్పర్తి. రితిక సింధు 9.88ఎస్ జి పి ఏ,  మోదుగు. రవికుమార్ 9.50 ఎస్ జి పి ఏ, శ్రీరాముల. మోహన గోవిందా చారి 9.38 ఎస్. జి.పి.ఏలు, ద్వితీయ సంవత్సరం రెండవ సెమిస్టర్ ఈసీఈ బ్రాంచ్ నుండి ఉబ్బనపల్లి. ధనుష్ గోపి 8.88 ఎస్ జి పి ఏ, మన్నెం.వెంకట నాగ శిరీష 8.75 ఎస్ జి పి ఏ, శీలం.హరిని 8.75 ఎస్ జి పి ఏ, కమ్మ.వరలక్ష్మి 8.63 ఎస్. జి. పి. ఏ లు సాధించారు.

ఈ అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్, మదర్ తెరిసా విద్యాసంస్థల ప్రెసిడెంట్ చలసాని. సాంబశివరావు , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఉదయ్ కిరణ్ భార్గవ్, వైస్ ప్రిన్సిపల్ డిప్లమో స్టడీస్ అండ్ ఐ. క్యు. ఎ. సి కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం. వి రామచంద్ర రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బంది అభినందించారు.