మోడల్ స్కూళ్లలో ఏసీఈ కోర్సు
12-04-2026 12:09 AM
- ఎంఈసీ కోర్సు స్థానంలో ప్రవేశం
- ఈ విద్యాసంవత్సరం అమలు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల కోసం విద్యాశాఖ కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకురానుంది. రాబో యే 2026 విద్యాసంవత్సరం నుంచి ఏసీఈ(అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఏ స్కూల్లోనూ ఎంఈసీ(మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్) కోర్సులో పెద్దగా అడ్మిషన్లు రావడం లేదు. ఈ క్రమంలోనే ఈ కోర్సు స్థానంలో ఏసీఈని ప్రారంభిస్తే బాగుంటుందని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.




