సుర్రుమంటున్న ఎండ
12-04-2026 12:08 AM
గద్వాలలో గరిష్ఠం 41.8 డిగ్రీలు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ దంచికొడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న తాండ్రపాడులో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల, నల్లగొండ జిల్లా ఘన్‌పూర్‌లో 41.7, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి, కామారెడ్డి జిల్లా పిట్లం, ములుగు జిల్లా వాజేడ్‌లో 41.6 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి.




