calender_icon.png 21 June, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్య జయశంకర్ యాదిలో.. ఘనంగా వర్ధంతి వేడుకలు

21-06-2025 05:20:51 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆవరణలో శనివారం ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ 15వ వర్ధంతి(Professor Jayashankar death anniversary) వేడుకలను విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) ఐక్య సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శి భాస్కరాచారి, బట్టుపల్లి అశోక్ చారి, గౌరవ అధ్యక్షులు తుమోజు సురేష్ చారి, జిల్లా నాయకులు శ్రీమంతుల వేణుగోపాల్ చారి, శ్రీరామోజు వెంకటయ్య చారి, రాధాకృష్ణ చారి, కస్తూరి రమేష్, గద్దెల పెళ్లి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.