07-01-2026 12:00:00 AM
మహబూబాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): పది పరీక్షలకు సుమా రు 60 రోజుల సమయం ఉందని, ఈ సమయాన్ని సమర్థమంతంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించి పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉపాధ్యాయులను కోరారు..జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా విద్యా శాఖ అధికారి రాజేశ్వర్, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో కలిసి జిల్లా కలెక్టర్ విద్యా శాఖకు సంబంధించి పలు అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాంప్లెక్స్ హెచ్‌ఎంల పరిధిలో ఉన్న పాఠశాలల హెచ్‌ఎంలతో సమీక్షలు నిర్వహించాలని, చదువులో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, వారి వృద్ధి కొరకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజు విద్యార్థులచే అ న్ని సబ్జెక్టులను చదివించి, సాధన చే యించాలని, అలాగే విద్యార్థుల చేతి రాతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చని వివరించారు.
ప్రతి రోజు విద్యార్థుల ప్రగతిని పరిశీలించాలని, ఫిబ్రవరిలో జరగబోయే ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షలో మూడవ తరగతి విద్యార్థులు మంచి సామర్థ్యాలను చూపా లని, ఆ దిశగా ఉపాధ్యాయులు, వి ద్యార్థులను సన్నద్ధం చేయాలని, జిల్లాను ముందంజలో ఉంచేందుకు పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఇంగ్లీషు సబ్జెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు ఇంగ్లీషు భాష నైపుణ్యతపై మెలకువలు నేర్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీజీ మందుల శ్రీరాములు, సైన్స్ అధికారి అప్పారావు, ప్లానింగ్ కో-ఆర్డినేటర్ పూర్ణచందర్, ఏఎస్సీ సం తోష్, తదితరులు పాల్గొన్నారు.