calender_icon.png 8 January, 2026 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన పంచాయతీ రాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య

07-01-2026 12:00:00 AM

ములుగు, జనవరి 6 (విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వా యి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభి పనులను రాష్ట్రపంచాయితీరాజ్ డైరెక్టర్ గు మ్మడిసోమయ్య పరిశీలించారు. మంగళవారం మేడారానికి చేరుకున్న ఆయన మేడారంలో సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం వద్ద,అదే విధంగా తెలంగాణ హరిత హోటల్ సర్కిల్, కన్నెపల్లి, ఊరట్టం సర్కిల్ వద్ద గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో నిర్మాణాన్ని చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఈ నెల 18లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మేడారం అంటేనే గిరిజన జాతర అని ప్రపంచ వ్యాప్తంగా జరిగే గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అన్నారు. ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపద్యంలో ఆలోపు పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శిల్పాలను ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల వర్కర్లను ఆయన అభినందించారు.