07-01-2026 12:00:00 AM
ఆర్డీఓ జయ చంద్రారెడ్డి
తూప్రాన్, జనవరి 6: ఆపరేషన్ స్త్మ్రల్‌లో భాగంగ పరిశ్రమలలో పని చేస్తున్న బాల కార్మికుల అంశంపై తూప్రాన్ డివిజన్ లోని మండల రెవెన్యూ అధికారులతో మంగళవారం ఆర్డిఓ జయచంద్ర రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పరిశ్రమలలో బాల కార్మికులు పనిచేస్తే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలు పనిచేస్తున్న కంపెనీలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
డివిజన్ పరిధిలోగల పరిశ్రమలు, వర్క్ షాప్‌లు, దుకాణాలు, ఇటుక బట్టీలు, చిన్న తయారీ కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. బాల కార్మికులు గుర్తించబడిన పక్షంలో వెంటనే వారిని పనుల నుంచి విముక్తి చేసి సంబంధిత కార్మిక, విద్య, మహిళ, శిశు సంక్షేమ శాఖలకు సమాచారం అందించాలని ఆదేశించారు.