calender_icon.png 30 September, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు కోరుకునేది ఒకటి.. ప్రభుత్వం చేసేది మరొకటి

30-09-2025 02:15:25 PM

ఆదిత్య వింటేజ్ నిర్మాణంపై ఏ గద్ద వాలింది.. ఎన్ని సూట్ కేసులు ఎత్తుకెళ్లింది: ఎంపీ

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) కాళేశ్వరం జపం చేస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ(Musi River) జపం చేస్తుందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు(Raghunandan Rao) ఆరోపించారు. ప్రజల కోరుకునేది ఒకటి.. ప్రభుత్వం చేసేది మరొకటన్నారు. మూసీ అభివృద్ధి పేరుతో హైడ్రా పేదల ఇళ్లు కూలుస్తోందని రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిపేట జలాశయం 12 గేట్లు 4 అడుగుల మేర ఎత్తితేనే పరిస్థితి ఇట్ల ఉంటే అన్ని గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తితే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌, పీసీసీ చీఫ్‌ తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 

నార్సింగిలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని సూచించారు. ఆదిత్య వింటేజ్ బంగ్లాను మూసీ పరివాహకంలో నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆదిత్య వింటేజ్ నిర్మాణం ఆపివేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆదిత్య వింటేజ్ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకెళ్లాలని కోరారు. సర్వీస్ రోడ్డు ఆక్రమించి కట్టే భవనానికి హెచ్ఎండీఏ ఎట్లా అనుమతించిందని మండిపడ్డారు. ఆదిత్య వింటేజ్ నిర్మాణాన్ని పూర్తిగా ఎఫ్ టీఎల్ లోనే నిర్మిస్తున్నారని చెప్పారు. ఆదిత్య వింటేజ్ నిర్మాణాలపై సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ కు లేఖ రాస్తున్నట్లు రఘునందన్ వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని బీజేపీ ఎంపీ హెచ్చరించారు. ఆదిత్య వింటేజ్ నిర్మాణంపై ఏ గద్ద వాలింది.. ఎన్ని సూట్ కేసులు ఎత్తుకెళ్లిందని రఘునందన్‌రావు ప్రశ్నించారు.