25 July, 2026 | 7:17 PM

పెండింగ్ కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

25-07-2026 06:11 PM

డీసీపీ యోగేష్ గౌతమ్

శంకర్ పల్లి,(విజయక్రాంతి): పెండింగ్ కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీసీపీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. శనివారం మోకిల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికతనికి నిర్వహించారు. కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కారం చూపే విధంగా సిబ్బంది పని చేయాలని సూచించారు. పనితీరులో ఎటువంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

పోలీసులు ప్రజలతో మమేకమవుతూ వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. కాగా గ్రామాల్లో రాత్రి సమయాలు గస్తీ నిర్వహిస్తూ ఎటువంటి దొంగతనాలు కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ సమస్యల పట్ల కఠినంగా వ్యవహరించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాధ్యతాయుతంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు  సురేష్ గౌడ్, పద్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.