8 March, 2026 | 12:01 AM

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి: ఏజీపీ కిషన్ నాయక్

07-03-2026 10:05 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం పాత దొనబండ తండా గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (హోమ్ & పోలీస్ సర్వీసెస్) తెలంగాణ హైకోర్టు భూక్యా కిషన్ నాయక్ తెలిపారు. శనివారం వర్ధాపురం, అల్లిపురం, భీల్యానాయక్ తండా గ్రామాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో చదువుతున్న దాదాపు 50 మంది విద్యార్థిని విద్యార్థులకు మార్చి 14వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు అవసరమైన పరీక్షా సామగ్రి అయిన ప్యాడ్లు,

జ్యామెట్రీ బాక్సులు, పెన్నులు, పెన్సిల్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేక మంది ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, కష్టపడి చదివితే ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.