8 March, 2026 | 12:02 AM

ఏఐవైఎఫ్ వాల్ పోస్టర్ విడుదల

07-03-2026 09:58 PM

ముకరంపుర,(విజయక్రాంతి): దేశం కోసం ప్రాణాలర్పించిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)  జిల్లా సమితి ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తాలో వాల్ పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపల్లి యుగంధర్ మాట్లాడుతూ... భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు దేశ స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యలను సైతం లెక్కచేయకుండా,

భవిష్యత్తు తరాల కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి వీరోచిత పోరాటాలు చేసి వీరమరణం పొందరన్నారు. దేశానికే  ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత చెడు మార్గాలను, చెడు అలవాట్లను విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు చంచాల మురళి, పెనుమల్ల భాస్కర్, అవినాష్, రాజేష్, ఎండి రెహాన్, ఎస్ అరవింద్, కే సాగర్, ఎస్ మనోజ్, ఎస్ శివరాం, గౌతమ్, అనిల్, సాయి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.