18-01-2026 12:00:00 AM
మలయాళ హీరో ఆంటోనీ వర్గీస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కట్టాలన్’. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు, పార్థ్ తివారి, జగదీశ్, సిద్ధిక్, వ్లాగర్- సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే ఫస్ట్‌లుక్ రివిల్ చేశారు. తాజాగా సెకండ్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేస్తోంది. ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘పాంగ్’ అనే ఏనుగు ఈ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం మే 14న థియేటర్లలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్; డీవోపీ: రెనదివ్; ఎడిటింగ్: షమీర్ మహమ్మద్; ప్రొడక్షన్ డిజైన్: సునీల్ దాస్.