19 April, 2026 | 2:14 AM

ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం

19-04-2026 12:29 AM
  1. రాష్ట్రాభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి
  2. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోం దని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అ న్నారు.

ఈ క్రమంలో వరంగల్, ఆదిలాబాద్, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ల నిర్మాణం వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన భూ సేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వ సతుల ఏర్పాటుకు చర్యలు వేగవం తం చేస్తున్నట్లు వెల్లడించారు. 

శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్‌కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి తదితరులతో కలిసి వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్ట్‌లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.