యష్ పరిశ్రమలో ప్రమాదం!
19-04-2026 12:25 AM
దట్టమైన పొగతో పరుగులు పెట్టిన కార్మికులు
అమీన్‌పూర్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్కులోని యష్ పరిశ్రమలో దట్టమైన పొగలు అలముకోవడంతో కలకలం రేగిం ది. దీంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. యష్ పరిశ్రమలో సీలింగ్ ఫ్యాన్లు తయారు చేసే విభాగంలో కాయిల్స్ వేడి చేసే మిషన్‌లో అధిక ఉష్ణోగ్రత వల్ల తీవ్రస్థాయిలో పొగ వ్యాపించింది.
దీంతో కార్మికులు ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవిం చిందని భావించి బయటకు పరుగులు తీశారు. ఘటన విషయం తెలుసుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది చేరుకొని పొగలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.






