19-08-2025 09:03:58 AM
ప్రజావాణిలో ఎస్ఎఫ్ఐ ఫిర్యాదు..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెరిడియన్ ప్రైవేట్ పాఠశాల(Meridian School) విద్యార్థులను బలవంతంగా మట్టి మొయిస్తూ వెట్టిచాకిరి చేయించిన పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ నేతలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పాఠశాల మరమ్మతు పనుల కోసం కూడా అభం శుభం తెలియని విద్యార్థుల చేత పెట్టి చేయిస్తూ రాజకీయ పలుకుబడితో ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. స్కూల్ యాజమాన్యం ఫీజులు వసూలు చేసి విద్యార్థులను బాల కార్మికులుగా మార్చడంపై, స్కూల్ గుర్తింపును రద్దు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమ్రాబాద్ ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ కాశన్న అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.