19-08-2025 11:30:22 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital) నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం ఖైదీ సోహైల్ ను గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా, ఆసుపత్రిలోని వాష్ రూమ్ వెంటిలేటర్ నుంచి దూకి తప్పించుకున్నాడు. ఖైదీ సోహైల్ బేగంపేటలో ఓ దోపిడి కేసులో అరెస్టయ్యాడు. నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించే ముందు బేగంపేట పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా, ఈ ఘటన చోటుచేసుకుంది. ఖైదీ సోహైల్ పలు కేసుల్లోనూ నిందితునిగా ఉన్నాడు. పారిపోయిన సోహైల్ పై చిలకలగూడ పోలీసులు(Chilakalguda Police) కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.