calender_icon.png 19 August, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..

19-08-2025 09:06:18 AM

పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం

వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన అధికారులు 

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని కోడూరు, కొమ్మాల తదితర గ్రామాలను ఆర్డీఓ వేణుమాధవ రావు(RDO Venu Madhava Rao), తహాశీల్దార్ భాషాపాక శ్రీకాంత్, ఎస్సై ఈట సైదులు రెవెన్యూ పోలీసు సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కోడూరు గ్రామం వద్ద రహదారిపై వర్షపునీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలను బందు చేయించారు. అదేవిధంగా కొమ్మాల గ్రామంలో కురిసిన వర్షానికి గ్రామంలోని వర్షపు నీరంతా రహదారిపై ప్రవహిస్తుండడంతో అట్టి రహదారిని తాత్కాలికంగా మూసివేయాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఎలాంటి నష్టం వాటిల్లిన ప్రజలు రెవెన్యూ,పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ కుమారస్వామి, ఇరిగేషన్ ఏఈ హరిస్వరూప్, పంచాయతీ కార్యదర్శి ఫర్హానా, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.