calender_icon.png 19 August, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో మరో విషాదం.. విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి

19-08-2025 10:28:46 AM

హైదరాబాద్: చంద్రాయణగుట్టలోని బండ్లగూడ(Bandlaguda) రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుదాఘాతం(Electric shock)తో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నివేదికల ప్రకారం... జల్పల్లి నుండి పాత నగరంలోని ఒక ప్రదేశానికి ఒక పెద్ద గణేష్ విగ్రహాన్ని ఒక ట్రాక్టర్ సహాయంతో తరలిస్తుండగా, అది ఓవర్ హెడ్ హైటెన్షన్ వైర్లకు తగిలింది. అఖిల్, వికాస్, డ్రైవర్ ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై నేలపై కుప్పకూలిపోయారు. అక్కడ ఉన్న వ్యక్తులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఇద్దరు మరణించారు. ఇదిలా ఉండగా, అంబర్‌పేట్‌లో రామ్ చరణ్ అనే వ్యక్తి గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా.. అడ్డువచ్చిన విద్యుత్ తీగలను తొలగిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు వదిలాడు. కాగా, గడిచినా 24 గంటల్లో ఇది రెండో సంఘటన. ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రామంతపూర్ వద్ద జరిగిన రథయాత్రలో ఆరుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మరణించిన విషయం తెలిసిందే.