19-08-2025 02:05:43 AM
ఎడతెరిపిలేని వర్షాలతో వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
తెగిన రోడ్లు, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఆదిలాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కు రుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం అతలాకుతలం అవుతున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వికలాంగుల కాలనీ, ధోబి కాలనీలలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జైనథ్, బేలా తాంసి, తలమడుగు భీంపూర్, బోథ్, సిరికొండ ఇచ్చోడ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బోథ్ మండలంలోని ధన్నూర్ (బి) గ్రామంలో భారీ వర్షానికి పలు పంట కులాల్లోని పత్తి పంట నీట మునిగింది. భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి సమీపంలో ఉన్న రెండు వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహించడంతో మండలంలోని 20 గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. కప్పర్ల పాఠశాలలో చదివే నిపాని విద్యార్థులు భారీ వర్ష సూచనతో ముందుగా ఇళ్లకు పంపించారు.
తిరుగు ప్రయాణంలో వరద ఉధృతితో విద్యార్థులు ఉదయం 10.30 నుంచి 3 గం టల వరకు గ్రామానికి అర కిలోమీటర్ దూ రంలోనే నిలిచిపోయారు. మధ్యాహ్నం ఉధృతి తగ్గడంతో ఇళ్లకు చేరుకున్నారు. అదేవిధంగా నిపాని గ్రామంలో వర్షం దాటికి బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురైంది. మండలంలోని పిప్పల్ కోటిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. తాంసి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద వాగు ఉప్పొంగి ప్రవ హించింది. మత్తడి వాగు ప్రాజెక్టు వరద ఉధృతి పెరగడంతో 2 గేట్లు ఎత్తి 4920.0 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
ఉ మ్మడి జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్ట్ వరద ఉధృతి పెరగడంతో అధికారులు 2 గేట్లను ఎత్తి దిగువకు వీటిని వదిలా రు. జైనథ్ మండలంలోని తర్నం వాగు పై ఉన్న తాత్కాలిక లోలేవల్ వంతెన పైనుండి వరద నీరు ఉధృతిగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.