19-08-2025 10:35:45 AM
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద..
రెండు లక్షల క్యూసెక్కుల నీటీ వరద..
కామారెడ్డి (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)కు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం 8 గంటలకు 39 గేట్లు ఎత్తారు. ఈ గేట్ల ద్వారా 2,32,418 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందిరమ్మ కాల్వకు 18,000, కాకతీయ కాల్వకు 4700 క్యూసెక్కుల నీటినీ వదిలారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు ఇంట్లోగా 2 లక్షల క్యూసెక్కులన్నీ వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో తాజాగా 18 అడుగులు (73.37 టీఎంసీ లు) నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. ఎస్సారెస్పీకి వరద పోటెత్తడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ప్రజలు ఎవ్వరు కూడా ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్దకు రావద్దని, కాలువల వైపు కూడా రావద్దని సూచించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తడంతో నీరు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఇందిరమ్మ, కాకతీయ కాలువల ద్వారా నీటిని వదులుతున్నారు.