calender_icon.png 19 August, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిడ్డ మహేష్ పై దాడి సిగ్గుమాలిన చర్య

19-08-2025 10:41:08 AM

తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జి రవి..

చిట్యాల (విజయక్రాంతి): మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన బీసీ బిడ్డ పంచిక మహేష్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై, అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జి రవి(JAC District Incharge Ravi) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15 న  కొందరు వ్యక్తులు మహేష్ భార్య,పిల్లలు ఆయన మామ, ఇతరులపై దాడి చేశారని, బిసి పొలిటికల్ జేఏసీనీ కలవడం జరిగిందన్నారు. ఒక బీసీ యాదవ బిడ్డను వ్యక్తిగతంగ టార్గెట్ చేసి కొట్టడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

గుడికి సంబంధించిందిన సమస్యలు ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలెగాని,దాడులు చేయడం వారి నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.మహేష్ యాదవ్ కాల్వపల్లి గ్రామానికి సర్పంచిగా పోటీ చేస్తాడని అక్కస్సుతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని,బీసీ పొలిటికల్ జేఏసీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబెట్టి, కాల్వపల్లిలో మహేష్ యాదవ్ ను గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డ శ్రీను, ప్రణీత్,వెంకటేష్,అఖిల్, సమ్మిరెడ్డి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.