1 July, 2026 | 7:09 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..

24-06-2025 06:32 PM

కట్ట లింగస్వామి డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి..

మునుగోడు (విజయక్రాంతి): మండలంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి(DYFI District Assistant Secretary Katta Lingaswamy) అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా చేసుకొని అమాయకమైనటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.

పాఠశాలల్లో చేరేంతవరకు వాళ్లకు కల్లబొల్లి మాటలు చెప్పి, పాఠశాలలో చేరిన తర్వాత ఫీజుల పేరుతోటి, బుక్స్, యూనిఫార్మ్స్ పేరుతోటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తాగుతున్నాయని మండిపడ్డారు. ఫీజుల నియంత్రణ పాటించకుండా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు పెంచుకుంటూ పోతూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారని తెలియజేశారు. బలపం పట్టలేని నర్సరీ విద్యార్థులకు కూడా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాల పేరుతో ఐదు నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారని విమర్శించారు. యూనిఫార్మ్స్, స్టేషనరీ, షూ, బెల్టు అమ్మకాలు చేయవద్దని ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి యదేచ్చగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాయని అన్నారు.

గత సంవత్సరం ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకొని ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు కొంతమంది విద్యార్థులు వెళుతూ ఉంటే అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో స్వయంగా పాఠశాలల ముందు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోటి కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, మండల కమిటీ సభ్యులు రవి, బొడ్డుపల్లి చింటూ, చరణ్, శివ, అరుణ్ ఉన్నారు.