17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రైల్వే టూరిజం ప్యాకేజీలు సద్వినియోగం చేసుకోండి

24-06-2025 06:39 PM

నిర్మల్ (విజయక్రాంతి): తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్రాల టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్(Tourism Joint General Manager Kishore) తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు హైదరాబాదు నుండి ఈ టూరిజం ప్యాకేజీలు జులై ఐదు నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్యాకేజీ వివరాలు వెల్లడించారు.

ప్యాకేజీ వివరాలు: (ఐదు జ్యోతిర్లింగ యాత్ర – SCZBG43): ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్) – త్రయంబకేశ్వర్ - భీమశంకర్ – ఘృష్ణేశ్వర్). ఈ యాత్రలో మహాకాళేశ్వర్/ఓంకారేశ్వర్/త్రయంబకేశ్వర్/భీంశంకర్/ఘృష్ణేశ్వర్/ఎల్లోరా/మోవ్/నాగ్పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు. ఈ యాత్ర  జూలై 05 వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14700, 3 ఏసీ ధర 22900, 2 ఏసీ ధర 29900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ నాందేడ్ ముధ్ఖడ్, పూర్ణ  మీదుగా వెళ్తుంది.

సౌకర్యాలు: రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్, టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం. ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సావకార్యాలు సమకురుస్తారు. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281495843, 9281030750, 9281030749 లకు సంప్రదించాలని మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రదించాలన్నారు.