calender_icon.png 16 October, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌత్ క్రాస్ కట్ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

16-10-2025 01:37:32 AM

మందమర్రి జీఎంకు పట్టణ పరిరక్షణ కమిటీ వినతి

బెల్లంపల్లి అర్బన్ అక్టోబర్ 15: సౌత్ క్రాస్ కట్ సింగరేణి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పట్టణ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మందమర్రి జిఎం రాధాకృష్ణ గురువారం బెల్లంపల్లి పట్టణ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం బెల్లంపల్లి పట్టణ పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ సౌత్ క్రాస్ కట్ బొగ్గు గనికి ఆనుకొని క్యాంటీన్ ఎస్‌ఎంపి ఆఫీస్, కోల్ శాంపిల్ ఆఫీస్, సివిల్ డిపార్ట్మెంట్, ల్యాంప్ క్యాబిన్ కార్యాలయాలు ఉండేవనీ తెలిపారు. కన్యకా పరమేశ్వరి దేవాలయo, పద్మశాలి ఫంక్షన్ హాలు స్థలంలో సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టు క్యాజువల్ వర్కర్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసే ఆఫీస్ సిమెంట్ పోల్స్ సిమెంట్ ఇటుకలు ఈ స్థలంలో తయారు చేసే వారన్నారు.

గనిమూతతో ఖాళీగా ఉన్న స్థలాన్ని కబ్జా కోసం దేవుని విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారనీ తెలిపారు. మసీదుకు ఇచ్చిన స్థలం కాకుండా పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.ఈ భూములను కాపాడాలని కోరారు. పద్మశాలి భవన్ ముందు అక్రమకట్టడాలను, మసీదు పేరుతో ఆనుకొని ఉన్న స్థలాన్ని కబ్జాపై చర్య లు తీసుకోవాలని  కోరారు. సింగరేణి స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ పరిరక్షణ కమిటీ సభ్యులు  చిప్ప నర్సయ్య, దాగం మల్లేష్,ఆడెపు రాజమౌళి, బొల్లం తిలక్ అంబేద్కర్, సబ్బని రాజేంద్రప్రసాద్, గెల్లి రాయలింగు, గెల్లి జయరాం, ఎండీ అఫ్జల్, రత్నంరాజం, దేవసాని ఆనంద్, ఆడెపు మహే ష్, పసులేటి వెంకటేష్ పాల్గొన్నారు.