16-10-2025 01:36:23 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈ సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం రాష్ట్ర పౌర సర్వ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు చేసినట్టు తెలిపారు.
జిల్లా లో 345 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కృషిచేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలలో పారదర్శకంగా ఉండాలని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్య లు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఆర్‌ఓ రత్న కళ్యాణి, డిఎస్‌ఓ రాజేందర్, డిఎం సివిల్ సప్లై సుధాకర్ వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ ఉన్నారు.
వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయండి
జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో ఆర్‌అండ్బీ పరిధిలో జరుగుతున్న అన్ని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబరులో ఆర్‌అండ్బీ విభాగాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, ప్రతి విభాగానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలని, అవసరమైన సదుపాయాలను సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఇన్‌చార్జి ఈఈ నర్సయ్య, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.