16-10-2025 01:38:27 AM
పనులను పురోగతిని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల పాత కలెక్టరేట్ భవనం కొంత భాగం కూలిపోవడంతో కలెక్టరేట్ లోని పలు కార్యాలయాలను ఇతర కార్యాలయాల్లోకి మార్చి న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారిం చి, పనులు వేగవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. 55 కోట్లతో నిర్మితమవుతున్న కలెక్టరేట్ భవన పనులను త్వరితగతిన చేపట్టేలా 125 మంది లేబర్లతో పనులు కొనసాగుతున్నాయి. ఈ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంను జిల్లా కలెక్టర్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, పని తీరును పునః పరిశీలించారు. పలు విభాగాలను స్వయంగా పరిశీలించిన ఆయ న, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు మార్గదర్శకాలను అందించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ... సమయానికి పనులు పూర్తి కావడం అత్యంత అవ సరం అని నాణ్యతలో రాజీపడకుండా పను లు వేగంగా జరగాలని పేర్కొన్నారు.
హెలిప్యాడ్, పార్కింగ్ తదితర అంశాలపై చర్చిం చారు. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి అధికారి నర్సయ్య, జిల్లా ప్రాజెక్ట్ ఇంజనీర్ లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.