calender_icon.png 12 September, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

11-09-2025 10:49:11 PM

బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి టౌన్: జిల్లా కేంద్రంలో గొప్ప చరిత్ర పాలిటెక్నిక్ కళాశాలకు ఉందని అలాంటి పాలిటెక్నిక్ కళాశాల ముందు కళాశాలకు చెందిన బారికేడ్లను ధ్వంసం చేస్తే పట్టించుకునేవారే లేరా? ఎక్కడపోతుంది సమాజమని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్(BC Political JAC State Chairman Yugandhar Goud) ప్రశ్నించారు. గురువారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ముందు ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వినాయక మండపం ఏర్పాటు చేయడానికి పోలీసులు కాని, మున్సిపల్ శాఖ కాని పర్మిషన్ ఇచ్చిందా? ఈరోజు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే ప్రభుత్వం యంత్రాంగం, పోలీసుశాఖ, మున్సిపల్ శాఖలు చూస్తూ ఎలా ఉన్నాయి? బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? గతంలో ఓ రైతు గురించి పెబ్బేరులో పోరాటం చేయడానికి వెళ్తే మీ పోలీసులు నాపై కేసు నమోదు చేశారు. మరీ ఇక్కడ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే మీరేంచేస్తున్నారు? ప్రజాస్వామ్యం ఎటుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని  ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.