11-09-2025 10:46:47 PM
పదిహేను మంది అరెస్ట్
నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం
మణుగూరు (వియక్రాంతి): పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ పాటి నాగబాబు తెలిపిన వివరాల మేరకు.. కొందరు వ్యక్తులు తోగ్గూడెం గ్రామంలోని సమ్మక్క సారక్క ఫంక్షన్ హాల్ నందు నగదుతో పేకాట ఆడుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం సాయంత్రం తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని వివరించారు. ఈ దాడిలో పదిహేను మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 1,69,520/- నగదు, 2 కార్లు, 15 సెల్ ఫోన్లు, 6 మోటార్ సైకిల్ లు, పేకలను స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్ప వని, ఎవరైనా పేకాట ఆడిన సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.