15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోండి

22-11-2025 12:00 AM

సదాశివనగర్, నవంబర్ 21(విజయక్రాంతి): సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం గత రెండు  రోజులుగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రచార నిర్వహించారు. తెలంగాణ రాష్ర్ట  ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్  శ్రీ కృష్ణ ఆదిత్య ఐఏఎస్  ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను కలిసి అడ్మిషన్ల ప్రచారం నిర్వహించారు.

ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌకర్యాలను పేద విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకొని, వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ కళాశాలలో చేరాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత అడ్మిషన్, ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్యా బోధన,ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం, పూర్తిస్థాయిలో ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన సొంత భవనాలు, వివిధ రకాల పోటీ పరీక్షలకు ఫిజిక్స్ వాలా మరియు ఖాన్ అకాడమీ ఆన్లున్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా నీట్, ఐఐటి జిమెయిన్స్, %జూజుఆ్పుజూఊ%, సీఏ ఫౌండేషన్ సాధించుట కొరకు కోచింగ్ ఇవ్వడం, పచ్చదనం పరిశుభ్రత కలిగిన కళాశాల ప్రాంగణం, మంచి ఉత్తీర్ణత సాధించడం కొరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో అదనపు స్టడీ అవర్ల నిర్వహణ, మినరల్ వాటర్ సౌకర్యం, విశాలమైన క్రీడా మైదానం, వెనుకబడిన విద్యార్థుల కొరకు ప్రత్యేక తరగతులు  ,మానసిక ఉల్లాసం కొరకు ప్రతి శనివారం వివిధ రకాల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని పరిసర ప్రాంత పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు  వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాల సదాశివనగర్ లో అడ్మిషన్ పొందాలని కళాశాల ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్ తెలిపారు. అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా తేదీ 19/11/2025 నాడు సదాశివ నగర్ లోని జడ్పీహెఎస్ ప్రభుత్వ పాఠశాలను, తేదీ 20/11/2025 నాడు జడ్పిహెఎస్ ధర్మారావుపేట్, జడ్పీహెఎస్ పద్మజివాడి పాఠశాలలను సందర్శించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.