యాక్షన్ స్లమ్ డాగ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్ రోడ్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తుండగా, టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ బహుభాషా చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అన్ని భాషల్లో పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో నిర్మాతలు ఇప్పుడు ప్రమోషన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ మూవీ టీజర్‌ను జూన్ 8న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నిర్మాతలు విడుదల చేసిన టీజర్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కనిపించిన విజువల్ ఎంతో డార్క్ అండ్ ఇంటెన్స్‌గా ఆకట్టుకుంటోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో ప్రశంసలు అందుకున్న జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.






