100 రోజుల షూటింగ్ పూర్తి
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘రణబాలి’ సినిమాను నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ‘రణబాలి‘ సిని మా తాజాగా సక్సెస్ ఫుల్‌గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇటీవలే గండికోటలో షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, ఔట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో ‘రణబాలి’ సెప్టెంబర్ 11న వరల్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మ్యూజిక్ - అజయ్ -అతుల్, డీవోపీ -నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఆర్, ఆర్ట్ డైరెక్టర్ విఠల్ కోసనం.






