బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో అక్రమాలపై త్వరలో కార్యాచరణ
2019లో పనిచేసిన మార్కెట్ సెక్రటరీ పద్మహర్ష, కొంత మంది కమీషన్ ఏజంట్ల కారణంగా అక్రమ కేసులు
గత 7 సంవత్సరాలుగా ప్రతినెల కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాం అంటూ రైతుల ఆవేదన
సికింద్రాబాద్, మార్చి25 (విజయక్రాంతి): బోయిన్‌పల్లి డాక్టర్ బిఆర్ అంబే ద్కర్ కూరగాయల మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై త్వరలో కార్యాచరణ ప్రక టిస్తామని పలువురు చేవెళ్ల రైతులు తెలిపారు. మార్కెట్ కి వచ్చిన రైతుల దగ్గర రూ,300 బ్రోకర్ కమీషన్ తీసుకుంటున్న కమీషన్ ఏజెంట్ల అక్రమాలపై పోరాటం తప్పదని హెచ్చరించారు.కేసులతో రైతుల గొంతులు నొక్కలేరని వారు వాపోయారు.
2019లో బోయిన్ పల్లి మార్కెట్ సెక్రటరీగా పనిచేసిన పద్మహర్ష, కొంత మంది కమీషన్ ఏజంట్లతో కుమ్మక్కై శాంతి యుతంగా నిరసన తెలిపిన కొంతమంది రైతులపై కక్షపూరితంగా కేసులు నమోదు చేశారని చేవెళ్ల వికారాబాద్ పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కారణంగా గత 7 సంవత్సరాలుగా తాము ప్రతినెలా కోర్టులకు హాజరవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
బుధవారం సికింద్రా బాద్ కోర్టుకు హాజరైన సందర్భంగా రైతులు విలేకరులతో మాట్లాడుతూ చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాలకు చెందిన రైతులు గతంలో 2019 అక్టోబర్ 30న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్లో అప్పటి సమస్యలపై శాంతియుత నిరసన చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో రైతులకు ప్రధానంగా కొన్ని డిమాండ్లు ఉండేవన్నారు. కమీషన్ను రూ.100కు రూ.4 మాత్రమే వసూలు చేయాలని,సీజన్లో ఇతర రాష్ట్రాల కూరగాయలనుఅనుమతించవద్దని, బార్దానీ బరువు తగ్గించవద్దని, అమావాస్య రోజులు లేదా కమీషన్ ఏజెంట్ల మరణాల పేరుతో మార్కెట్ను మూసివేయవద్దని కోరినట్లు వివరించారు.
అయితే ఈ నిరసన తర్వా త కమీషన్ ఏజెంట్లు,అప్పటి మార్కెట్ సెక్రటరీ పద్మహర్ష కుమ్మక్కై రైతులపై కక్షపూరి తంగా కేసులు నమోదు చేశారని వారు ఆరోపించారు. ఈ కేసుల కారణంగా గత 7 సంవత్సరాలుగా ప్రతినెలా కోర్టులకు హాజరవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మార్కెట్లో జరుగుతున్న అక్రమాలను దాచిపెట్టేందుకు 100 మంది రైతులకు ఒక బ్రోకర్‌ను నియమించి,రైతుల నుండి రోజుకు రూ.300 వరకు అదనపు కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ఈ అక్రమాలపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామ ని రైతులు హెచ్చరించారు.కోర్టు వాయిదాకు హాజరైన చేవెళ్ల ప్రాంత రైతులు చింపుల సత్యనారాయణ రెడ్డి,యాలాల కరుణాకర్ రెడ్డి,సి.మల్లేష్, కె.రాజిరెడ్డి,కె.శ్రీరామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.




