26 March, 2026 | 2:51 AM

బడంగ్‌పేట్ అధికారులపై రామిడి రాంరెడ్డి ఫైర్

26-03-2026 12:00 AM

బడంగ్ పేట్ మార్చి 25: (విజయక్రాంతి): బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయంకు కూత వేటు దూరంలో ఆరు నెలలుగా ము రుగు నీరు ప్రవహిస్తున్న అధికారులు మా త్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, మురుగు సమస్యపై ఎన్నిసార్లు విన్న వించినా అధికారుల్లో కనీసం చలనం కూడా లేదని బడంగ్ పేట్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు రామిడి రాం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం బడంగ్ పేట్ సర్కిల్ అల్మాస్ గూడ రాజీవ్ గృహకల్పలో నెలకొన్న మురుగు సమస్యను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రామిడి రాం రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు ఆరు నెలలుగా రాజీవ్ గృహకల్పలో భూగర్భ డ్రైనేజీ పైపులు పగిలి రోడ్డుపై మురుగు నీరు ప్రహిస్తుందన్నారు. దీనిపై అనే సార్లు బడంగ్ పేట్ సర్కిల్ డీసీ, ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

మురుగు నీరు ఇళ్ల మధ్యలో చేరడంతో దుర్వాసన, దోమల సమస్యతో సమీప ఇళ్లలో ప్రజలు ఉండలేని స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే జిహెచ్‌ఎంసి బడంగ్ పేట్ సర్కిల్ అధికారులకు పిర్యాదు చేసిన, వారు పట్టించుకోవడం లేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వెంటనే రాజీవ్ గృహకల్ప ము రుగు నీటి సమస్యను పరిష్కరించకుంటే, ప్రజలతో కలిసి బడంగ్ పేట్ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.