17 April, 2026 | 9:29 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవు

09-04-2025 12:12 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండ లం గుండి గ్రామంలో ఈనెల తొమ్మిదవ తేదీన జరగాల్సిన మైనర్ బాలిక వివాహాన్నీ  ముందస్తు సమాచారం మేరకు జిల్లా బాలల పరిరక్షణ విభా గం అధికారుల తో కలసి తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే  బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు, కుల పెద్దలకు కౌన్సిలింగ్ నిర్వహించి బాలికను తాత్కాలిక వసతి నిమిత్తం జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్‌కు తరలించారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ  బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇరువైపులా కుటుంబ సభ్యులు, పురోహితుల పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రెండు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చైల్ హెల్ప్ లైన్ కోఆర్డినేట ర్ బాల ప్రవీణ్ కుమార్, సూపర్వైజర్ లైలా, కౌన్సిలర్ చంద్రశేఖర్, రవళి, పోలీస్  కానిస్టేబుల్ పండిత్ ఉన్నారు.