అంగన్వాడీ కేంద్రం లో సీమాంతం
04-07-2026 01:11 PM
మెట్ పల్లి, జులై 4(విజయక్రాంతి): పట్టణంలోని 14వ వార్డు న్యూ బోయవాడ అంగన్వాడి కేంద్రంలో శనివారం సీమంతం అన్నప్రసన మరియు టి హెచ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 14 వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష-నవీన్ పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలకు తగిన సూచనలు సలహాలు అందించారు. ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించి బాలామృతం ఉపయోగాలు తెలియజేశారు. ఏడు నెలలు నిండిన పిల్లలకు బాలమృతం కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష-నవీన్, సూపర్వైజర్ ప్రతిభ, అంగన్వాడీ టీచర్ రజిని, చంద్రకళ వార్డ్ సభ్యులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.






