4 July, 2026 | 2:16 PM

రైతుల సేవే విండోల లక్ష్యం కావాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి

04-07-2026 01:13 PM

మానకొండూరు, జులై 4, (విజయక్రాంతి): రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మానకొండూర్ సింగిల్ విండో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విండో చైర్మన్ గా నాగిశెట్టి రాజయ్య, డైరెక్టర్లుగా ఏనుగుల చొక్కారెడ్డి,కత్తెర్ల రాజు,మంగురపు నర్సవ్వ,సుధగోని తిరుపతిగౌడ్, గాలి మొగిలి,కొట్టె అంజిరెడ్డి, ఎం.రామకృష్ణ,దూలం దేవేంద్ర, కొలిపాక మొగిలి, బుర్ర శ్రీకాంత్, కుర్ర వెంకటస్వామి, ఏగోళపు శ్రీనివాస్ గౌడ్ ల చేత  జిల్లా సహకార శాఖ సీనియర్ రిజిస్ట్రార్ శైలజ ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతన్నలకు అండగా నిలవాలని,  సింగిల్ విండో వ్యవస్థ ద్వారా రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, పంటల బీమా వంటి సేవలను పారదర్శకంగా అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నదని, రైతు భరోసా కింద ఎకరానికి ఏటా రూ.12,000 పెట్టుబడి సాయం, రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ అమలు చేస్తున్నదని, అర్హులైన ప్రతి రైతుకూ అందేలా సింగిల్ విండోలు కీలక పాత్ర పోషించాలన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా రాజకీయాలకు అతీతంగా పని చేయాలని ఎమ్మెల్యే హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి,పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, బుర్ర శ్రీధర్,ఇర్ఫాన్, కోండ్ర సురేష్, కొత్తకొండ శంకర్, సాయిరి దేవయ్య, గొల్లెన కొమురయ్య, తమిశెట్టి రాజేశ్, సతీష్ కుమార్ సంఘ సెక్రటరీ పాకాల లక్ష్మారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు