తెలంగాణ పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం దొడ్డి కొమురయ్య
04-07-2026 01:20 PM
హైదరాబాద్: తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం దొడ్డి కొమురయ్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరులూదిన ధీరుడు దొడ్డి కొమురయ్య( Doddi Komaraiah) స్ఫూర్తిగాథను భావితరాలకు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడిందని గుర్తుచేశారు. దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించి గౌరవించుకుందని వెల్లడించారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కేటీఆర్ ఘన నివాళులర్పించారు.






