13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు

31-03-2026 12:17 AM

చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సతీష్

శంకర్‌పల్లి, మార్చి 30 (విజయక్రాంతి): లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని చేవెళ్ల ట్రాఫిక్ సిఐ సతీష్ అన్నారు. సోమవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధి బీడీఎల్ ప్రధాన కూడలిలో  పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఓవర్ లోడ్ తో వాహనాలు రోడ్డుపై వెళ్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ప్రమాదం జరుగుతుందని తెలియజేశారు. కాగా వాహనాలకు తప్పని సరిగా నెంబర్ ప్లేట్లు ఉండాలని హెచ్చరించారు. పట్టణ కేంద్రంలోని రోడ్ల పై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుప రాదని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సురేష్ , సిబ్బంది ఉన్నారు.