13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఒకే వాహనం.. ఆరుగురు మైనర్లు..!

31-03-2026 12:17 AM

ప్రమాదకర స్థాయిలో డ్రైవింగ్

ఆర్టీవో కార్యాలయం ముందు చెక్కర్లు

నాగర్ కర్నూల్ మార్చి 30 ( విజయక్రాంతి): ఓకే ద్విచక్ర వాహనంపై ఆరుగురు మైనర్లు అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రయాణం చేస్తూ వాహనదారుల కంటపడ్డారు. ఈ ఘటన సోమవారం నాగర్ జిల్లా గగ్గలపల్లి, తాడూరు గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు రవాణా శాఖ కార్యాలయం ముందు కనిపించింది.

అటుగా వెళుతున్న వాహనదారులు ప్రమాదక రంగా ప్రయాణిస్తున్న మైనర్ డ్రైవింగ్ చూసి క్లిక్ మన్పించారు. జిల్లా రోడ్డు రవాణా, ఆర్టీసీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నా ఇలాంటి ప్రమాదకర స్థాయి ప్రయాణం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిత్యం వందలాది వాహనాలు అత్యంత వేగంగా వచ్చి వెళ్తున్న జాతీయ రహదారిపై ఇలా ఈ స్థాయిలో మైనర్లు ప్రయాణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.