పిడుగుపాటుకు గురై రెండు పాడి పశువులు మృతి
31-03-2026 12:15 AM
వెల్దండ మార్చి 30 : వెల్దండ మండల పరిధిలోని సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం తో పిడుగుపాటుకు గురై రెండు పాడి పశువులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అజిలాపూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం, గాన్ గట్టు తండాకు చెందిన పుణ్య నాయక్కు చెందిన పాడి పశువులు ప్రాణాలు కోల్పోయాయి.
పశువుల దొడ్డి సమీపంలో పిడుగు పడటంతో మూగజీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న పాడి పశువులు మృతి చెందడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లి తమన చెల్లించి తమ ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.




