30 May, 2026 | 1:48 AM

అన్‌లోడింగ్‌లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

30-05-2026 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, మే 29 (విజయక్రాంతి) : కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడిం గ్ తో వచ్చిన లారీలను గోదాములు, మిల్లులలో వేగంగా అన్ లోడింగ్ చేసి తిరిగి పం పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హె చ్చరించారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూ ర్ మండలం గుడిపేట, నమ్నూర్ లలోని ధా న్యం కొనుగోలు కేంద్రాలు, ఎస్.ఆర్.ఎం., గాయత్రి రైస్ మిల్లులను సందర్శించి ధా న్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలను ప రిశీలించారు.

అనంతరం లక్షెట్టిపేట మండల కేంద్రంలోని జై యోగేశ్వర రైస్ మిల్ ను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలి సి సందర్శించి ధాన్యం దిగుమతి, సి. ఎం.ఆర్. ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం దించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సంవత్సరం దాదాపు లక్ష 60 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశామని, హమాలీల సమస్యను అధిగమిం చేందుకు స్థానికంగా హమాలీలను తీసుకొని ధాన్యం ఎగుమతి, దిగుమతులను వేగవం తం చేయడం జరిగిందన్నారు. పెద్దపల్లి, క రీంనగర్ లలో హమాలీలతో కలిపి 2 గోదాములను ఇచ్చారని, అకాల వర్షాల నేపథ్యం లో రైతులకు నష్టం కలగకుండా ధాన్యం ని ల్వ చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందు కు చర్యలు చేపట్టమన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల, మిల్లుల నిర్వహకులుపాల్గొన్నారు.